ఈ మధ్య కాలం లో ప్రస్తుత సమయంలో చాలా మంది Food Truck బిజినెస్ ను ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు దీనికి ఎటువంటి రూమ్, రెంట్ మరియు లేబర్స్ అస్సలు అవసరం ఆయితే ఉండదు. ఇప్పుడు ఉన్న కాలంలో పరిస్థితి చూసుకొని అతి వేగంగా అభిరుద్ధి చెందుతున్న ఆదాయపు ఐడియా వచ్చేసి ఫుడ్ బిజినెస్ ఎందుకంటే అతి తక్కువ పెట్టుబడి మరియు హోటల్ కోసం అద్దె లేకుండా దీనిని ప్రారంభించవచ్చు. దీని ఎక్కువ మ్యాన్ పవర్ కూడా అవసరం ఉండదు కాగా దీని కేవలం కొన్ని గంటల పాటు డ్రైవింగ్ చేస్తూ మనకు నచ్చిన ప్లేస్ లో ట్రక్ ను పెట్టవచ్చు.
మన భారతదేశం లో Corporate మరియు IT రంగం విపరీతంగా పెరగడం మూలంగా ప్రజలకు సమయం కొరత బాగానే ఏర్పడింది దీనికి తోడు మహానాగరాల్లో ఇళ్ళలో దూరంగా ఉండడం వంటి కారణాలు వాళ్ల చాలా మంది ప్రజలు ఫుడ్ ట్రక్ లకు బాగా మొగ్గుచూపుతున్నారు. ఇందులో చాలానే విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ సమయం వృదా కాకుండా మరియు తక్కువ ధరాలకే ఇంటి లాంటి భోజనం దొరకటం మరో విశేషం. అందుకనే ప్రస్తుత కాలం లో మీరు కూడా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం కోసం వేచి ఉన్నారా అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే.
ఈ బిజినెస్ ను ఎలా ప్రారంభించాలి
- ముందుగా మీరు ఒక మంచి ప్లేస్ ను నిర్ణయించుకోవాలి మీరు ఎంచుకొనే స్థలం రద్దీ ప్రదేశం లేదా మంచి Tourist, Corporate మరియు IT అభిరుద్ధి చెందివున్న చోటు అయితే ఇంకా అదిక ఆదాయం ను పొందవచ్చు.
- తర్వాత మీరు మీ అనుకూలత ప్రకారం ఒక Truck లేదా Van ను మీరు ప్రతి రోజు విక్రయించుబోతున్న రకాలు మరియు దాని క్వాంటిటి బట్టి తయారు చేయించుకోవాలి.
- మీరు విక్రయిస్తున్న వంటలను ఇంటి నుండే సరిపడే మోతాదులో తయారు చేసుకొని ఫుడ్ ట్రక్ వద్దకు తెచ్చి వాటిని విక్రయించవచ్చు లేదా ట్రక్ ప్లేస్ లో కూడా వంటలు తయారుచేయవచ్చు ఎందుకనగా ఇంటి నుండే ఆయితే మీకు టైమ్ సేవ్ అవుతుంది మరియు కస్టమర్ వాయిట్ లేకుండా తొందరగా హ్యాండిల్ చేయవచ్చు.
- ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కస్టమర్ ఆగలేరు ఎంత త్వరగా ఆయితే తిని వాళ్ళ వాళ్ళ వర్క్ ను చూసుకుంటారు. ఈ పాయింట్ మీరు దృష్టి లో పెట్టుకొని అలా చేస్తే సంతృప్తి ఇంకో వాళ్ళకు ట్రక్ గురించి మంచి రివ్యూ ఇవ్వగలాడు.
ఫుడ్ ట్రక్ నుండి కలిగే లాభాలు
- అద్దె ఉండదు: ప్రస్తుతం ఎక్కడ చూసిన విపరీతంగా అద్దెలు పెరగడం మూలంగా ఆదాయంలో చాలా వరకు అద్దెకు పోవడం వల్ల సరిపడే లాభాలు రావడం లేదు. కానీ దీనిలో మీరు ఎటువంటి అద్దె అయితే కట్టవల్సిన అవసరం లేదు.
- తక్కువ పెట్టుబడి: మీరు దీనిని అతి తక్కువ పెట్టుబడితో మొదలిపెట్టవచ్చు దీనిని మీరు కేవలం 1 లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంబించవచ్చు.
- అనుకూలత: ఈ ఒక్క బిజినెస్ ముఖ్యంగా వాహనం డ్రైవ్ చేసి చేస్తారు కాబట్టి మీకు అనుకూలమైన ప్రదేశం లో దీనిని సులభంగా తరలించవచ్చు.
- తక్కువ సమయం: ఇందులో ముఖ్యంగా రోజంతా పని చేయాల్సిన అవసరం ఉండదు మీకు మంచి రద్దీ ఉన్న సమయం లేదా భోజనం సమయం లో ఓపెన్ చేసి పూర్తి అయ్యిన తర్వాత మూసి వేయవచ్చు.
ఇంకా మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు బిజినెస్ ఐడియాస్ కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.