దసరా పండుగ శుభకాంక్షలు 2024: మన భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా విజయదశమి నిలుస్తుంది. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో, 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగను ప్రధానంగా చెడుపై మంచికి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుతారు. దసరా, “దశహర” అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది, అంటే చెడు తొమ్మిదింటిని సంహరించడం అని అర్థం.
దసరా పండుగకు మూడింటి ప్రాముఖ్యత ఆయితే ఉంది. ఇది ప్రధానంగా చెడు,శక్తి, ధైర్యం, మరియు విజయం యొక్క పండుగగా పూజిస్తారు . ఇది ప్రధాన కథనంగా రాముడు రావణుడిని ఓడించిన విజయం ఇది, దుర్గమ్మ మహిషాసురను సంహరించిన విజయాన్ని పూజించే పండుగగా ఈ పండుగకు ప్రాచుర్యం వచ్చింది. ఇరు కథానికలలోనూ చెడుపై మంచికి సాధించిన విజయాన్ని ప్రతిబింబించే ఉదంతాలు ఉంటాయి.
ప్రతి వచ్చే ఏడాది దసరా పండుగ సందర్భంగా, 9 రోజులు దేవీ దుర్గమ్మను వివిధ రూపాలలో మరియు సాంప్రదాయాలు ప్రకారంగా పూజిస్తారు. ప్రతిరోజూ ఒక రూపానికి అంకితం చేస్తారు. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాలుగవ రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని, ఏడవ రోజు కాలరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, మరియు తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి రూపాలలో దుర్గమ్మను చక్కగా అలకరించి దేవి ను పూజిస్తారు.
దసరా పండుగ సందర్భంలో ఆయుధ పూజలు, వాహన పూజలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఇది జీవనంలో విజయానికి సూచనగా భావిస్తారు. ఆయుధాలు మరియు వాహనాలను పూజించడం ద్వారా మనం చేసే కర్మలు విజయం సాధించాలని దైవ సాక్షిగా ప్రార్థిస్తారు. ఇది ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఆయుధ పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఇందులో విద్యార్థులు తమ పుస్తకాలలో , పరికరాలు, ఉద్యోగులు తమ పని చేసే ముట్లు , సాధనాలు అందరి దృష్టి లో పూజిస్తారు.
Read More : Dasara Festival : తెలుగు రాష్ట్రాల ప్రజలుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సిఎంలు …
ఇది కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి జరుపుకునే ప్రతీయకంగా పండుగ కూడా. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర లేదా దేవాలయాల్లో కలిసి దుర్గమ్మకు పూజలు చేసి, ఒకరికి ఒకరు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. దసరా పండుగ సాంప్రదాయిక నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, మరియు సామూహిక వేడుకలతో కూడా ప్రసిద్ధం. ముఖ్యంగా నవరాత్రి రోజుల్లో గర్బా, దాండియా వంటి నృత్యాలు ప్రజలకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి అందులో సుఖంగా ఇరు వారు సంతోషంగా జరుపుకుంటారు.
రామాయణ కథ ఆధారంగా రామలీల ప్రదర్శనలు, దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైనవి. ఈ కార్యక్రమాలలో రాముడు, సీత, రావణుడు వంటి పాత్రలను ప్రదర్శించి, చెడుపై మంచికి సాధించిన విజయాన్ని ప్రదర్శిస్తారు.ఇది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ రామలీల కార్యక్రమాలు ప్రజలను విస్తారంగా పూజలు ఆకర్షిస్తాయి.ఇది ఆఖరి రోజున, రావణుడిని దహనం చేసే కార్యక్రమం ఇది , చెడు శక్తులను నాశనం చేస్తామనే సంకేతాన్ని అందిస్తుంది.
దసరా పండుగ ఆధ్యాత్మికతకు, భక్తికి మరియు స్వచ్ఛతకు పెద్ద పీట వేస్తుంది. ఇది ప్రజలు తమ ఇళ్ళను శుభ్రపరచి, వాటిని రంగురంగుల పూలతో తయారు చేసి , దీపాలతో అలంకరిస్తారు. దేవీ దుర్గమ్మను పూజించి, తమ జీవితాల్లో శాంతి, సౌభ్రాతృత్వం మరియు సమృద్ధి కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ సమయంలో దేవాలయాలు, వీధులు, మరియు పట్టణాలు అందంగా చక్కగా అలంకరించబడతాయి.
దసరా, వ్యక్తిగత జీవనంలో మాత్రమే కాకుండా సామాజిక జీవనంలో కూడా ఐక్యతకు మరియు సామూహికతకు బలంగా ప్రతీక.ఇది పండుగ సందర్భంగా ప్రజలు భిన్నతలను పక్కన పెట్టి, ఒకటిగా చేరి సంబరాలు సంతోషంగా జరుపుకుంటారు. ఇది మనం ఒక కుటుంబంలా కలిసి ఉండాలని అంశం , మనలో ఐక్యతలో బలమేననే సందేశాన్ని ఇది అందిస్తుంది.మనలో ఉత్సహన్నిమరియు సంతోషంగా అంతేకాకుండా, ఈ పండుగ అందరికి కొత్త ఆరంభాలను సూచిస్తుంది. చెడును నాశనం చేసి, మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని ప్రేరేపిస్తుంది. ప్రతి సంవత్సరం, దసరా పండుగ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలను, ఆత్మవిశ్వాసాన్ని దుర్గమ్మ తల్లి 9 అవతారాలలో తీసుకువస్తుంది.
Read Here : Skin Care with Kiwi : కివిలో ఇన్ని చర్మ రహస్యాలు ఉన్నాయా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!