Dasara Subhakankshalu : దసరా శుభాకాంక్షలు చెప్పిన తెలుగు రాష్ట్రాల సిఎంలు అటు ఏపీ ముఖ్యమంత్రీ నారా చంద్రబాబు నాయుడు విజయదశిమి శుభాకాంక్షలు తెలిపియారు. అలాగే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దుష్ట శక్తుల నిర్మూలన తర్వాత, శాంతి మరియు సౌభ్రాతృత్వంతో అందరూ కలిసి సుఖంగా జీవించాలన్నది ఈ పండుగ ప్రధాన సందేశమని ఆయన వివరించారు. ఈ స్ఫూర్తితో, శాంతియుతం మరియు అభివృద్ధికి తోడ్పడే సమాజం కోసం ప్రయత్నిద్దామని రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయ దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ జీవన సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణకు ప్రజలు నిరంతర విజయాలు చేకూరాలని, ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని విజయ దుర్గామాతను ప్రార్థిస్తున్నానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన సాంస్కృతిక జీవన విధానంలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ రోజున కుటుంబ సభ్యులు ఒకచోట చేరి సంబరాలు జరుపుకోవడం ఐక్యతకు ప్రతీక అని వ్యాఖ్యానించారు.
విజయదశమి సందర్భంగా సీఎం తో పాటుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం రాజ్ భవన్‌లో గవర్నర్ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం, అధికారులు, సిబ్బందితో కలిసి ఆయుధ మరియు వాహన పూజలు నిర్వహించారు. దుష్ట శక్తుల నిర్మూలన తర్వాత, చెడుపై మంచికి సాధించిన విజయాన్ని ప్రతిబింబించే జీవిత సత్యం విజయదశమి పండుగ సూచిస్తుందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.