Kiwi ఫ్రూట్ ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ వంటి దేశలో ఎక్కువగా పండుతుంది. అయితే ఇప్పుడు దీని పంట మన భారత దేశంలో కూడా పండిస్తున్నారు. ఒక అధ్యాయంలో తేలింది ఏమంటే కివి పండు వల్ల చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అతి ముఖ్యంగా కివి వాడడం వల్ల చర్మం కోసం కావాల్సిన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కివి మన చర్మం మెరుగు పడడంలో చాలా ఉపయోగపడుతుంది.
Kiwi పంట ఒక మంచి బిజినెస్ ఐడియాగా కూడా మనం పరిగణిలోకి తీసుకోవచ్చు. దీనిని పండించే రైతులకు ఇది చక్కటి ఆదాయాన్ని మరియు లాభాలను ఇస్తుంది. అయితే ఈ ఆర్టికల్లో మనం కివి నుండి మన చేర్మాన్నికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.
కివి వల్ల చర్మ ప్రయోజనాలు
- Kiwi పండులో ముఖ్యంగా Vitamin c మోతాదు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ c వల్ల మన మొఖంలో కోలేజెన్ అనే పదార్థం ఉత్పత్తి జరుగుతుంది ఇది ముఖ్యంగా చర్మంలో పగుళ్లు మరియు మడుతలు రాకుండా ఆపుతుంది.
- kiwi పండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మొఖంలో మరియు చర్మంలో పింపల్స్ రాకుండా చర్మాన్ని చక్కగా ఉంచుతాయి.
- Kiwi పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల ఇది మనం క్రమంగా వాడినప్పుడు మన చర్మాన్ని మరియు మొఖాన్ని మెరుగా ఉంచుతుంది.
మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు హెల్త్ & ఫిట్నెస్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.